: బరువు తగ్గేందుకు ఇదో మంచి మార్గం

మీరు అధిక బరువును తగ్గించుకోవాలనుకుని పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారా... అయితే ఇది కూడా ప్రయత్నించి చూడండి. ఏమంటే రోజుకు పది గ్లాసుల నీరు తాగడం. ఇలా అధికంగా నీటిని తీసుకోవడం వల్ల మీరు చక్కగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు తీసుకునే నీరు మీ శరీరంలోని అదనపు కేలరీలను కరిగించివేస్తుందని, తద్వారా బరువు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ నీరు తాగడం వల్ల మీ బీఎంఐని నీరు తగ్గిస్తుంది. రోజుకు 8 నుండి పది గ్లాసుల నీటిని తాగడం వల్ల మీరు ఆహారం తక్కువ తీసుకుంటారు. అలాగే భోజనానికి కూర్చునేముందు కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల మీ శరీరంలోని కేలరీలు తగ్గుతాయి, తద్వారా మీరు బరువు తగ్గుతారట. మన శరీరంలోని కొవ్వును కరిగించడంలో నీరు ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత ఎక్కువ కెలరీలను కలిగిన ద్రవపదార్ధాలను తీసుకోవడంకన్నా భోజనానికి ముందు నీటిని తాగడం వల్ల మన శరీరంలోని యాభైశాతం కొవ్వును కరిగించుకోవచ్చట. ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల చక్కగా ఆటలను ఆడగలరు. ఆటల వల్ల శరీరం అలసిపోవడం అనేది కూడా తక్కువగా ఉంటుందట. కాబట్టి చక్కగా నీరు తాగండి, ఆరోగ్యంగా బరువును తగ్గించుకోండి.

More Telugu News