: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం : విజయశాంతి

కాంగ్రెస్ అధిష్ఠానం పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లు ఆమోదం పొందుతుందని... తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ఏర్పడుతుందని మెదక్ ఎంపీ విజయశాంతి అన్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో వడ్డెర సామూహిక భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం కోసం ఎంపీ లాడ్స్ నుంచి విజయశాంతి నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కలను నెరవేర్చబోతున్న సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా కృతజ్ఞతగా ఉండాలని కోరారు.

More Telugu News