: కాశ్మీర్ సమస్యలో అమెరికా జోక్యం చేసుకోవాలి : నవాజ్ షరీఫ్
అత్యంత సున్నితమైన కాశ్మీర్ సమస్యలో అమెరికా జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. యూఎస్ అధ్యక్షుడు ఒబామాతో తాను మరి కొద్ది రోజుల్లో భేటీ కానున్న సమయంలో షరీఫ్ ఈ ప్రతిపాదన తీసుకురావడం విశ్లేషకులను ఆకట్టుకుంటోంది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత కూడా షరీఫ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఉద్దేశించి ఇదే ప్రతిపాదన చేశాడు. కాకపోతే, అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.