: అందుకే ఆ వయొలిన్‌ అంత రేటు

అదొక వయొలిన్‌... ఒకప్పుడు ప్రేమ రాగాలను పలికించింది. అదికూడా కొన్ని దశాబ్దాల క్రితం. ఆ తర్వాత అది సముద్రగర్భంలో కలిసిపోయి తర్వాత మళ్లీ బయటపడింది. సదరు వయొలిన్‌ను వేలం వేస్తే అది ఆహూతుల నోట కోట్లు పలికించింది.

1912లో ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో టైటానిక్‌ అనే ఒక మహానౌక మునిగిపోయింది. ఇందులో సుమారు 1517మంది చనిపోయారు. ఈ దుర్ఘటన ఆధారంగా అదే పేరుతో సినిమా కూడా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. మునిగిపోయిన టైటానిక్‌ నౌకను వెలికితీయగా అందులో వయొలిన్‌ కూడా బయటపడింది. ఈ నౌకలోని వస్తువులను వేలం వేస్తే ఇది చాలా ఎక్కువ ధర పలికిందట. హెన్రీ అల్డ్రిడ్జ్‌ అండ్‌ సన్‌ అనే వేలం సంస్థ బ్రిటన్‌లో దీన్ని వేలానికి ఉంచగా శనివారం నాడు ఇది రూ.7.5కోట్ల ధర పలికిందట. ఎంతైనా అది టైటానిక్‌ నౌకలో దొరికింది కదా... అందుకే అంత క్రేజు...!

More Telugu News