: తెలంగాణ బిల్లును ఓడిస్తాం: దేవినేని ఉమ

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ మంత్రుల బృందం సమావేశాన్ని తమ పార్టీకి చెందిన ఎంపీలు చూసుకుంటారని అన్నారు. జగన్ బెయిలు కోసం కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా డెల్టా రైతులు నికర జలాలు లేక అల్లాడిపోతున్నారని, గోదావరి డెల్టా కింద పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారని, అసలు మిగులు జలాలే లేనప్పుడు కేటాయింపులు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.

More Telugu News