: మనుషుల్లో వచ్చే క్యాన్సర్లకు కారణమేమంటే...
మనుషుల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్లకు బోలెడు రకాల జన్యువులు కారణమవుతాయట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో వచ్చే పలు రకాల క్యాన్సర్ కణితుల వృద్ధికి తోడ్పడుతున్న 127 రకాల జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. క్యాన్సర్ వ్యాధుల నిర్ధారణకు కొత్త పరికరాలను తయారు చేయడానికి, అలాగే వివిధ క్యాన్సర్ వ్యాధులు సోకిన వ్యక్తులకు అనుగుణంగా తగు చికిత్సలను రూపొందించడానికి ఈ జన్యువుల గుర్తింపు తోడ్పడగలదని పరిశోధకులు చెబుతున్నారు.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనంలో కొన్ని రకాల క్యాన్సర్లలో తరచుగా మార్పు చెందే జన్యువులు ఇతర రకాల కణితుల్లో కూడా కనిపిస్తున్నట్టు తేలింది. ఈ విషయాన్ని గురించి అధ్యయనానికి నేతృత్వం వహించిన లి డింగ్ మాట్లాడుతూ, తాము వివిధ రకాల జన్యువులను గుర్తించడం అనేది ఆరంభం మాత్రమేనని, మనుషుల్లో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే జన్యువుల జాబితాను రూపొందించే అవకాశంపై శాస్త్రవేత్తలు, క్యాన్సర్ నిపుణులు ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, త్వరలోనే దానికి మనం చేరువ అవుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.