: రావూరి భరద్వాజ ఇకలేరు!

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ కొంత సేపటి క్రితం మరణించారు. 86 సంవత్సరాల భరద్వాజ హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణాజిల్లా మొగులూరు గ్రామంలో 1927 జూలై 5న ఆయన జన్మించారు. కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఏడవ తరగతి వరకే ఆయన చదువుకున్నారు. వెండితెర రంగుల ప్రపంచంలో తెరవెనుక జీవితాలపై ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ రచనకే ఈ ఏడాది జ్ఞానపీఠ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. సమాజంలోని వివిధ అంశాలపై ఆయన పలు నవలలు, కథానికలు, నాటికలు రాశారు.

More Telugu News