: వయసు ప్రభావం తగ్గించాలంటే...
వయసు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మనపై చాలానే ఉంటుంది. ముఖ్యంగా బయటికి కనిపించే వాటిలో చర్మంపై వయసు చూపించే ప్రభావం చాలా ఎక్కువేనని చెప్పవచ్చు. వయసు ప్రభావాన్ని తగ్గించాలంటే మన శరీరానికి బీటా కెరోటిన్ చాలా అవసరం. క్యాన్సర్, గుండెజబ్బులు వంటి వాటిని నివారించడానికి మనం తీసుకునే ఆహారంలో బీటా కెరొటిన్ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బీటాకెరొటిన్ అనేది అత్యంత శక్తిమంతమైన వ్యాధి నిరోధక కారకం. ఇది ఆకుకూరల్లోను, కాయగూరల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చిలగడ దుంప, నారింజ, క్యారెట్, మామిడిపండ్లలో కూడా ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా చిలగడ దుంపకి చర్మాన్ని తాజాగా ఉంచే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా జలుబు, దగ్గు వంటివాటిని తగ్గించడంలో తోడ్పడుతుంది. పళ్లనీ, ఎముకలను బలంగా ఉంచేలా తోడ్పడుతుంది.
అలాగే బీటా కెరోటిన్ ఎక్కువగా క్యారెట్‌లో ఉంటుంది. ఇది గుండెజబ్బులు రాకుండా చూడడమేకాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మేనిపై వయసు ఛాయలు పడకుండా కాపాడుతుంది. కాబట్టి చక్కగా బీటాకెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందా. అందంగా ఉందాం!