: కేంద్ర, హోంశాఖలకు లేఖలు రాస్తా: సీఎం కిరణ్

ఛత్తీస్ గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ లను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించే సమయంలో పాటించిన విధానాలను ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయాలని కేంద్రంతో పాటు హోంశాఖకూ లేఖలు రాస్తామని ఏపీఎన్జీవోలతో జరిగిన చర్చల సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ను కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉద్యోగ సంఘాలకూ ఇవ్వాలన్నారు. ఉద్యోగ సంఘాలకు అనుమతి ఇవ్వకపోతే తాము కూడా జీవోఎంను కలవబోమని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఐటీఆర్ (ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా హైదరాబాద్) ప్రతిపాదన ఇప్పటిది కాదని.. విభజనకు, ఐటీఐఆర్ కు సంబంధం లేదని కిరణ్ తెలిపారు.

More Telugu News