: ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: ముద్దుకృష్ణమ
కొందరు నేతలు ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసి సమ్మె గొడవలు లేకుండా చేసుకుంటున్నారని టీడీపీనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేతిలో యూపీఏ కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై దిగ్విజయ్ సింగ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను తమ డీఎన్ఏ అంటారని, టీఆర్ఎస్ ను కలుపుకుంటామని చెబుతారని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు జీతాలు లేకుండా ఉద్యమం చేస్తే వారి త్యాగానికి ప్యాకేజీలంటూ రేటుకడుతున్నారని.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్యమం చేసిన సీమాంధ్రులు దిగ్విజయ్, షిండేలకు కనబడలేదా? అని ఆయన ప్రశ్నించారు.