: విశాఖలో ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలోని మద్దిలపాలెం ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. విభజనను సీమాంధ్ర ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే... కాంగ్రెస్ పెద్దలకు చీమ కుట్టినట్టైనా లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆర్టీసీ సమ్మెను విరమించామని తెలిపారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వెనక్కు తీసుకునేంత వరకు శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు.

More Telugu News