: తీరు మార్చుకోని పాక్.. మరోసారి కాల్పులు
పొరుగు దేశం పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. భారత్ ఎప్పటికప్పుడు దీటైన జవాబిస్తున్నా తీరు మార్చుకోని పాక్.. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతోంది. తాజాగా నేటి ఉదయం కూడా పాక్ దళాలు జమ్మూకాశ్మీర్ వద్ద సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డాయి. ఓ భారత సైనిక శిబిరంపై కాల్పులు జరపగా.. బీఎస్ఎఫ్ దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. మూడు రోజుల వ్యవధిలో పాక్ కాల్పులకు పాల్పడడం ఇది ఏడోసారి.