: ఢిల్లీలోని గుర్గావ్ టోల్ ప్లాజాపై దుండగుల దాడి
దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్గావ్ టోల్ ప్లాజాపై దుండగులు దాడి చేశారు. గత అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ప్లాజాలో ఉన్న సిబ్బందిని దారుణంగా కొట్టి లక్షా 80వేల రూపాయల నగదును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం. చోరీకి పాల్పడిన వారంతా యువకులేనని తెలుస్తోంది. ఈ ఘటనంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తెలుస్తోంది.