: ఈ ట్యాక్సీలో ఎక్కడికెళ్లినా ఫరవాలేదు

ప్రస్తుతం మహిళలకు సమాజంలో రక్షణ కొరవడుతోంది. అలాగే మహిళలు కూడా రాత్రి పూట ఉద్యోగాలు చేయాల్సిన అవసరం కూడా పెరుగుతోంది. ఇలాంటి వారికి రక్షణ మరింత తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహిళలపై నేరాలను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ జిల్లాకు చెందిన అధికారులు ఒక కొత్త ప్రణాళికను తయారుచేశారు. రాత్రిపూట తిరిగే ట్యాక్సీలకు జీపీఎస్‌ సిస్టమ్‌ను అనుసంధానించాలని నిర్ణయించారు. దీంతో మహిళలపై రాత్రిపూట జరిగే నేరాలను చాలా వరకూ కట్టడిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చిన రేడియో ట్యాక్సీల్లో మనం ఎక్కడికి వెళ్లినా ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా రాత్రిపూట తిరిగే ట్యాక్సీలను, క్యాబ్‌లు అన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. ఈ విధానాన్ని అనుసరించాలని ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నింటికీ సూచనలందించారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లోనే మహిళలు రాత్రిపూట కూడా విధులు నిర్వహించాల్సి ఉంటోంది. కేవలం సాఫ్ట్‌వేర్‌ సంస్థలకే కాకుండా ఇతర ట్యాక్సీలకు కూడా జీపీఎస్‌ వ్యవస్థను అమర్చాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడం వల్ల మహిళలపై జరిగే అఘాయిత్యాలను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవస్థను అమర్చడం వల్ల ప్రయాణీకుల వద్దనుండి అధికంగా ఛార్జీలను వసూలుచేయకుండా పరిమితులు విధించి వాటి ప్రకారమే వసూలు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.

More Telugu News