: ఈ నెల 20న 'ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధన' సభ : వరవరరావు
గతంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలం అని చెప్పిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు విమర్శించారు. సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే నాయకులు తెలంగాణపై నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై నెలకొన్న సందిగ్ధతలను తొలగించేందుకు... ప్రజాస్వామ్యవాదులతో ఈ నెల 20న శామీర్ పేటలో 'ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సాధన' పేరుతో సదస్సును నిర్వహించనున్నట్టు వరవరరావు తెలిపారు.