: పదవిలో ఉంటూనే సీమాంధ్ర సమస్యలపై పోరాడవచ్చు: పురంధేశ్వరి

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో సమస్యలపై పోరాడేందుకు రాజీనామాలు చేయనవసరం లేదని, పదవిలో ఉంటూనే పోరాడవచ్చని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె నేడు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక నేతలు, పారిశ్రామికవేత్తలతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సమైక్యవాదినే అని, అయితే రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పుకొచ్చారు. అందుకే మనకు కావలసిన వనరులు, సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలను కేంద్ర మంత్రుల బృందం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. సీమాంధ్రుల హక్కులను కాపాడతానని పురంధేశ్వరి హామీ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధినే అని ఆమె ఉద్ఘాటించారు.

More Telugu News