: పనిమనిషిపై అత్యాచారం చేసిన కామాంధుడికి ఏడేళ్ల జైలుశిక్ష

తాను పనిచేస్తున్న ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న మహిళపై అత్యాచారం చేసిన నేరానికి... ఓ కామాంధుడికి ఢిల్లీ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు మూడు వేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే, బీహార్ లోని మధుబనికి చెందిన ప్రమోద్ అనే యువకుడు ఢిల్లీలో ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. అదే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న మహిళపై 2010లో అత్యాచారం చేశాడు. కేసును విచారించిన కోర్టు... ఈ నేరం నీచాతినీచమని వ్యాఖ్యానించింది.

More Telugu News