: సీమాంధ్ర మంత్రులు డబుల్ గేమ్ ఆడుతున్నారు: జస్టిస్ లక్ష్మణరెడ్డి

కేంద్ర మంత్రుల బృందానికి వీలైనంత త్వరగా సమాచారం అందించడానికే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేస్తున్నారని ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులందరూ కలసి సీమాంధ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకరిస్తూ వీరంతా డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. విభజనను అడ్డుకుంటామని చెబుతూ సీమాంధ్ర ప్రజలను మంత్రులు మోసగించారని మండిపడ్డారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. మంత్రులంతా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని... లేకపోతే ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఉండాలని జస్టిస్ లక్ష్మణరెడ్డి ఘాటుగా పేర్కొన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాల పట్ల సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

More Telugu News