: పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్
గత అర్ధరాత్రి బీహార్ లోని పాట్నా సాహిబ్ స్టేషన్ వద్ద ధనపూర్-కామాఖ్య రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం పదకొండు బోగీలు పట్టాలు తప్పాయని తూర్పు మధ్య రైల్వే అధికార ప్రతినిధి యూ.కె.ఘా తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు ఐదు బోగీలను పట్టాలపైకి చేర్చినట్టు ఆయన వెల్లడించారు. మరో ఆరు బోగీలను పట్టాలపై చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైలులో ప్రయాణిస్తున్న వారిని వారికోసం రైల్వే శాఖ మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.