: చేతుల్లేనివారికి 'మరచేయి' సాయం
కొందరు ప్రమాదంలో చేతులు కోల్పోతారు. ఇలాంటి వారు ఇక జీవితాంతం చేతుల్లేకుండా అవిటివారుగా ఉండాల్సిందే. ఇలాంటివారి జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సరికొత్త రోబో చేతిని రూపొందించిన శాస్త్రవేత్తలు ఈ రోబో చేతితో చక్కగా చేతుల్లేని వారికి స్పర్శ జ్ఞానాన్ని కలిగించవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మరచేతులు వచ్చినా అవి కేవలం ఆకారంగా మాత్రమే మిగులుతున్నాయేగానీ వారికి స్పర్శాపరంగా ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేకుండా ఉన్నాయి. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ స్మార్ట్ రోబో చేయి చేతుల్లేని వారికి చక్కటి స్పర్శాజ్ఞానాన్ని కూడా కలిగిస్తుందని చెబుతున్నారు.
షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మెదడుతో నేరుగా అనుసంధానం ఉండే ప్రత్యక్ష పరికరం ద్వారా పనిచేసే కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేశారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల ద్వారా కృత్రిమ అవయవాలను రూపొందించే అవకాశాలను మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కృత్రిమ చేతికి స్పర్శాపరమైన కదలికల్ని పునరుద్ధరించడానికి సాధారణంగా మెదడు పంపించే కదలికల సంకేతాలకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించడమేకాకుండా, చేయి మెదడుకు వెనక్కి పంపించే సంకేతాలను కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని పరిశోధకులు స్లిమాన్ బెన్స్మయా చెబుతున్నారు. తమ పరిశోధనల్లో రోబో చేయి శరీరంలోని సెన్సరీ వ్యవస్థను అవగాహన చేసుకుని, మెదడును ప్రేరేపించడం ద్వారా నాడీ క్రియాశీలతకు సంబంధించిన ప్రక్రియల్ని పునరుత్పత్తి చేసినట్టు చెప్పారు.