: విభజనపై కేంద్రం మొండిగా ముందుకెళుతోంది: మంత్రి పితాని

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందని మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం తాము మరింత మొండిగా ముందుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని, అలాగే ఆంటోనీ కమిటీ ఏం చేసిందో తెలియదని అన్నారు. ఇప్పుడు జీఎంవో కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుందో రాదో తెలియదని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకోనున్నామని పితాని తెలిపారు.

More Telugu News