: పట్టువదలని లగడపాటి

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా ఆమోదింపజేసుకునేందుకు పట్టువిడవకుండా పోరాడుతున్నారు. నేడు కూడా ఆయన స్పీకర్ ను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళగా, నిరాశ తప్పలేదు. స్పీకర్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే తాము రాజీనామా చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుంచి 25 ఎంపీ సీట్లు అవసరం లేనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News