: 'ఎయిర్ కోస్తా' సేవలను ప్రారంభించిన సీఎం

ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్తా సర్వీసులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు లాంఛనంగా ఆరంభించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం జరిగిన ఎయిర్ కోస్తా సర్వీసుల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. తొలుత కొద్ది విమానాలతో దేశంలోని ముఖ్య నగరాలకు సర్వీసులు నడుపుతామని, అనంతరం సేవలను ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని సంస్థ చైర్మన్ రమేశ్ లింగమనేని తెలిపారు. వచ్చే రెండేళ్ళలో రూ.618 కోట్లు పెట్టుబడి పెడతామని వివరించారు.

More Telugu News