: ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులు.. వసూళ్లు
మెక్సికోలో కేటుగాళ్లు ఇంటర్నెట్ ద్వారా నేరాలకు తెగబడుతున్నారు. వ్యక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతరత్రా విలువైన సమాచారాన్ని తస్కరించి, ఆ తర్వాత ఫోన్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. అలా బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. అడిగినంత ఇచ్చుకోకపోతే వారి సమాచారాన్ని దుర్వినియోగం చేస్తామంటూ బెదిరిస్తారు. ఇటీవలే స్పెయిన్ కు చెందిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశామని, డబ్బులు తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులను మెక్సికో నుంచే బెదిరించారు. ఇలాంటి కేసులు ఇప్పుడు మెక్సికో పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.