: ఆ విషయం ముందే తెలుసంటున్న ధోనీ

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంటుపై టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. సచిన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంటు ప్రకటించే విషయం తనకు ముందే తెలుసన్నాడు. ఏడు వన్డేల సిరీస్ సందర్భంగా రేపు ఆసీస్ తో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు వేదికైన పుణెలో ధోనీ మీడియాతో ముచ్చటించాడు. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే వీడ్కోలు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నాడు. సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ ఎప్పుడూ టాప్ లోనే నిలిచాడని కొనియాడాడు. సచిన్ చివరి టెస్టును తామంతా ఆస్వాదిస్తామని ధోనీ చెప్పాడు.

More Telugu News