: విపత్తు ఎదుర్కొనేందుకు సిద్ధం: కమిషనర్ రాధ

ఫైలిన్ తుపాన్ ప్రస్తుతం 200 కిలోమీటర్ల దూరంలో ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ రాధ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తుపాను ఈ సాయంత్రానికి తీరం దాటవచ్చని అన్నారు. సహాయక చర్యల్లో భాగంగా త్రివిధ దళాలను అప్రమత్తం చేశామని, విపత్తు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News