: 64 వేల మంది సురక్షితం: మంత్రి రఘువీరా
ఫైలిన్ ముప్పు ముంచుకొస్తోంది. వాతావరణ శాఖ, ప్రకృతి విపత్తునివారణ శాఖల హెచ్చరికల ప్రకారం కోస్తా తీరం పెనుముప్పును ఎదుర్కోనుంది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలను, విపత్తు నివారణ చర్యలను ప్రారంభించింది. ఇప్పటివరకు తీరం వెంబడి ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకార గ్రామాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. తాను మూడు రోజులు వైజాగ్ లో ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు.