: రేపు రెండు రూపాల్లో దర్శనమివ్వనున్న బెజవాడ కనకదుర్గమ్మ
బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారు దసరా ఉత్సవాల్లో భాగంగా రేపు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేకువ జామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుర్గాదేవిగానూ, మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు మహిషాసుర మర్దని గాను దర్శనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించరు. ఈ సమయంలో అర్చకులు అమ్మవారి అలంకార క్రతువును నిర్వహిస్తారు.