: తెలుగు ప్రజల తలరాతను ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారా?: బాబు
విభజన తీరును నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై తెలుగు ప్రజల తలరాతను ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారా? అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు అంశంతో పాటు నీటి వనరులు, ఉద్యోగాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న డిమాండుతోనే తాను దీక్షకు కూర్చున్నానని తెలిపారు. రాజకీయాలు చేసేందుకు తాను నిరాహార దీక్ష చేపట్టలేదని స్పష్టం చేశారు. అయినా, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని చంద్రబాబు పేర్కొన్నారు.