: పిడుగులు పడి 21 మంది మృతి
బీహార్ లో పిడుగులు పడిన సంఘటనల్లో 21 మంది మరణించారు. రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఆరుగురు, బంకా జిల్లాలో ఐదుగురు, జముయి జిల్లాలో ముగ్గురు, సుపాల్ జిల్లాలో ఇద్దరు, భోజ్ పూర్, కతిహార్, పాట్నా, గయా, రోహ్తాస్ జిల్లాల్లో ఒక్కొక్కరు పిడుగుపాటుకు చనిపోయారు. ఈ జిల్లాల్లో నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం పిడుగులు పడ్డాయి. మరణించిన వారిలో నలుగురు పిల్లలున్నారు.