: బాంబు పేలుడులో ముగ్గురు పాక్ సైనికుల మృతి

పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తున్వా ప్రావిన్స్ లోని మిర్జాలీ చెక్ పోస్టు సమీపంలో ఈ రోజు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. వీరిని ఆర్మీ వైద్య శిబిరానికి తరలించారు. గాయపడిన సైనికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. భద్రతా దళాల కాన్వాయ్ చెక్ పోస్ట్ సమీపంలోకి రాగానే రిమోట్ సహాయంతో బాంబు పేల్చారని పాక్ సైనికాధికారులు తెలిపారు. అయితే, ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.

More Telugu News