: అవసరమైతే ఎయిరిండియాను ప్రైవేటు పరం చేస్తాం: అజిత్ సింగ్

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటు పరం చేయాలని ప్రజలు, ప్రభుత్వం, పార్లమెంటు కోరితే కచ్చితంగా చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తెలిపారు. ఎయిరిండియా నష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్రం ఇకపై ఎలాంటి ఉద్ధీపన ప్యాకేజీలు ఇవ్వబోదని అన్నారు. ఈ విషయం ఎయిరిండియా ఉద్యోగులకు, మేనేజ్ మెంట్ కు తెలుసనుకుంటానని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాకు ఎంతో విలువైన ఆస్తులు, మంచి పైలట్లతో పాటు ఎన్నో ఫ్లైయింగ్ రూట్స్ ఉన్నాయని... వీటితో సంస్థ గట్టెక్కేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

More Telugu News