: ఉగ్రవాదుల లక్ష్యం తిరుమల.. పూజారి సాయంతో పేలుళ్ళకు ప్లాన్?
ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైందవ పుణ్యక్షేత్రం తిరుమలపై ఉగ్రవాదుల కన్నుపడిందా? అంటే, అవుననే అంటున్నారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు. ఇటీవలే తమిళనాడులోని తిరువళ్ళూరులో అరెస్టయిన ఓ తీవ్రవాది వెల్లడించిన సమాచారం మేరకు తిరుమలలో అప్రమత్తత ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవలో ఉపయోగించే గొడుగులను చెన్నై నుంచి తీసుకురానున్నారు. అయితే, ఆ గొడుగుల్లో పూజారి సహకారంతో బాంబును అమర్చి విధ్వంసానికి పాల్పడాలన్నది ఉగ్రవాదుల వ్యూహమని పోలీసులంటున్నారు. కాగా, చిత్తూరు జిల్లా పుత్తూరులో పోలీస్ ఆపరేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.