: విజయనగరం అగ్నిగుండం..144 సెక్షన్

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్వంత జిల్లా విజయనగరం జిల్లా అగ్నిగుండంలా మారిపోయింది. రాష్ట్ర విభజనకు అనుకూలుడని ఆరోపణలెదుర్కొంటున్న బొత్సపై ఉత్తరకోస్తా వాసులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. సీఎం కుర్చీపై కన్నేసిన కారణంగానే బొత్స అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు ఇచ్చాడని విజయనగరం జిల్లా వాసులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో వారు విజయనగరంలో బొత్స నివాసం ముట్టడికి యత్నిస్తున్నారు.

నిన్నటి నుంచి పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాటలు, ఘర్షణలు జరుగుతున్నాయి. గత అర్థరాత్రి వరకు బొత్స ఇంటి ముట్టడికి యత్నించిన సమైక్యవాదులు ఈ ఉదయం తెల్లవారుజామునుంచే బొత్స నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు యత్నించారు. దీంతో, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించి, గాలిలోకి కాల్పులు .

అప్పటికీ ఆందోళనకారులు పట్టువీడకపోవడంతో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులను అరెస్టు చేసి గజపతినగరం తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పార్వతీపురం వద్ద పోలీసు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

More Telugu News