: మంత్రి కన్నా ఇంటి ముట్టడి.. పరిస్థితి ఉద్రిక్తం

తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... గుంటూరులోని ఆయన ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేయడంతో... నిరసనకారులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

More Telugu News