: ఉదయం పూట ఇలాంటి ఆహారం మంచిది కాదట

చాలామంది పని తొందరలో ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా ఉండడం, లేదా సమయాభావం కారణంగా ఏదో ఒక ఫాస్ట్‌ ఫుడ్‌ను తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఇది సరైనది కాదట. ఉదయం పూట ఎక్కువ నూనె శాతం కలిగిన పదార్ధాలను తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. నూనెశాతం ఎక్కువగా కలిగిన ఆహారపదార్ధాలతో రోజును ప్రారంభించడం సరైన పద్ధతి కాదని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

ఘజియాబాద్‌లో కొలంబియా ఏషియా హాస్పిటల్‌లో న్యూట్రిషనిస్టుగా ఉన్న అంబికా శర్మ కొన్ని ఆహార పదార్ధాలను ఉదయం పూట దూరంగా ఉంచితే మేలని చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా నెయ్యి లేదా నూనెలో వేపిన పరాటాలు తినకుండా ఉంటే మేలట. ఒకవేళ వాటిని తినాలకున్నా మళ్లీ నూనె వేసుకోకుండా పెరుగుతో తీసుకుంటే కొంత వరకూ మేలట. అలాగే హాస్టళ్లలో ఉండేవారికి ఎక్కువగా ఉదయం పూట పూరీ, ఆలూకూరతో టిఫిన్‌ ఉంటుంది. కానీ ఇది కూడా ఆరోగ్యకరమైన ఆహారం కాదట. వేరే ప్రత్యామ్నాయం లేకపోతే ఆ పూరీలను పేపర్‌తో అద్ది వాటిలోని అదనపు నూనెను తీసేసి తింటే కొంతవరకూ మేలేనంటున్నారు. జంక్‌ ఫుడ్‌, చిప్స్‌, వేపుళ్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌, స్వీట్స్‌, క్యాండీలు ఇలాంటి వాటన్నింటినీ ఉదయం పూట తీసుకోకుంటే మన ఆరోగ్యానికి కొంత వరకూ మేలు చేసుకున్నవారమవుతామని చెబుతున్నారు.

More Telugu News