: రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆందోళన కారులతో సంయమనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దేలా చూడాలని సీఎం సూచించారు. 60 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన విరమించాలని సీఎం, పీసీసీ చీఫ్ లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బాధ్యతను తాము స్వీకరిస్తామని సీఎం భేటీలో సీమాంధ్ర నేతలు తెలిపారు.