: విభజన అత్యంత బాధాకరమైన విషయం: శైలజానాథ్

రాష్ట్ర విభజన అత్యంత బాధాకరమైన విషయమని మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజన ప్రక్రియలో రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన, విభజనకు సంబంధించిన బిల్లు అసెంబ్లీకి ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే నన్నారు. చరిత్రలో ఏ రాష్ట్ర ఏర్పాటు అసెంబ్లీ తీర్మానం లేకుండా జరగలేదని శైలజానాథ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీపై మండిపడిన మంత్రి.. తెలంగాణపై ఇడుపులపాయలో చేసిన ప్రమాణం జగన్ కు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఎక్కడ జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసునన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర్రాన్ని విభజించమన్న వారు ఇప్పుడెందుకు దీక్షలకు దిగుతున్నారని నిలదీశారు. 'విభజనపై అసలు మీ అభిప్రాయమేంటో చెప్పాలని' శైలజానాథ్ వైయస్సార్ సీపీని డిమాండ్ చేశారు. బయటొకటి, లోపలొకటి పెట్టుకుని ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News