: జగన్ సభ తెలంగాణపై దండయాత్రే
వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాద్ లో నిర్వహించాలనుకుంటున్న సభను... తెలంగాణపై దండయాత్రగానే తాము భావిస్తున్నామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) నేతలు దిలీప్ కుమార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, విమలక్క తెలిపారు. వద్దని చెప్పినా వినకుండా సభను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. లోటస్ పాండ్, సాక్షి భవనాలను ముట్టడించి, ఆక్రమిస్తామని తెలిపారు. హైదరాబాద్ ను యుద్ధభూమిగా మార్చేందుకు కిరణ్, చంద్రబాబు, జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.