: నిర్ణయాన్ని ప్రధాని పునరాలోచిస్తారని ఆశిస్తున్నా: పళ్లంరాజు
తెలంగాణపై కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని పునరాలోచిస్తారని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి పళ్లంరాజు చెప్పారు. రాష్ట్ర విభజన అంశం తొందరపాటు చర్య అని వ్యాఖ్యానించారు. ఆంటోనీ కమిటీ సిఫార్సులు రాకుండానే కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే రాజీనామా చేస్తానని ప్రధాని వద్దకు వెళ్లి చెప్పానని, అయితే తొందరపడవద్దని ప్రధాని చెప్పారన్నారు. అయినా, రాజీనామా చేశానని, ఇంకా ప్రధాని ఆమోదించలేదన్నారు.