: నాలుగువందల్లో మనవి ఐదు

ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ విశ్వవిద్యాలయాలుగా నిలిచిన నాలుగు వందల విశ్వవిద్యాలయాల్లో మన భారతదేశానికి చెందిన నాలుగు విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది. బ్రిటన్‌ ప్రముఖ వారపత్రిక టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ఇస్తుంది. ఇలా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు వందల విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ఇచ్చింది. ఈ జాబితాలో మనదేశానికి చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి.

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ 2013-14 జాబితాలో భారతదేశానికి చెందిన పంజాబ్‌ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, ఐఐటీ-కాన్పూర్‌, ఐఐటీ-ఖరగ్‌పూర్‌, ఐఐటీ-రూర్కీ ఉన్నాయి. పంజాబ్‌ యూనివర్సిటీ, ఢిల్లీ, కాన్పూర్‌ ఐఐటీలు తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పంజాబ్‌ యూనివర్సిటీ 226-250 ర్యాంకుల వర్గీకరణలో, ఢిల్లీ, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, రూర్కీ ఐఐటీలు 351-400 వర్గీకరణలో ఉన్నాయి. వరుసగా మూడో ఏడాది కూడా అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీయే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానాన్ని అమెరికాకు చెందిన హర్వర్డ్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా పంచుకున్నాయి. తొలి పది స్థానాల్లో ఏడు అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు దక్కించుకున్నాయి.

More Telugu News