: కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు :హర్షకుమార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అమలాపురం ఎంపీ హర్షకుమార్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చేందుకు సీమాంధ్రలో కాంగ్రెస్ ఎంపీల గెలుపే కారణమన్నారు. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను పార్టీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు.