: నటి అంజలిపై కోర్టు ఆగ్రహం

సినీ నటి అంజలిపై చెన్నై స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నిమిత్తం ఈ రోజు ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయినా రాకపోవడంతో మండిపడింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో అంజలి కోర్టు విచారణ ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు కోర్టుకు గైర్హాజరైన అంజలికి పోయినసారి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాకపోవడానికి గల కారణాలను ఆమె న్యాయవాది కోర్టుకు వివరించడంతో వెనక్కి తీసుకుంది.

More Telugu News