: ఇలా కూడా హెచ్‌ఐవీ వస్తుందట!

హెచ్‌ఐవీ వ్యాధి పలు రకాలుగా వ్యాపిస్తుంది. అయితే మాదక ద్రవ్యాల వాడకం వల్ల కూడా హెచ్‌ఐవీ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు కాస్త తగ్గించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

క్వీసెంట్‌ సీడీ4టీ అనే రోగ నిరోధక కణాల్లో మార్పులకు కొకైన్‌ దోహదం చేస్తున్నట్టు, ఫలితంగా హెచ్‌ఐవీ వంటి వ్యాధులు సులభంగా సంక్రమించే ముప్పు ఎక్కువవుతున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఇలాంటి మాదకద్రవ్యాలు వాడడం వల్ల హెచ్‌ఐవీ ముప్పు మరింత పెరుగుతున్నట్టుగా వీరి పరిశోధనల్లో తేలింది. మనకు సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి శరీరం సదరు వ్యాధి కారక క్రిములతో పోరాడుతుంది. ఇలాంటి పోరాటంలో శరీరంపై మాదకద్రవ్యాల ప్రభావం ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవడానికి తాము నిర్వహించిన అధ్యయన ఫలితాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన డిమిట్రియోస్‌ ఎన్‌.వటకిస్‌ చెబుతున్నారు.

More Telugu News