: ఫిర్యాదు చేసిన 18 ఏళ్లకు న్యాయం

వరకట్నం కేసు పెట్టిన 18 ఏళ్లకు ఓ బాధితురాలికి న్యాయం జరిగింది. ఈ కేసులో బాధితురాలి అత్త, మామ, భర్తలకు శిక్ష పడింది. ఢిల్లీలో 1996 జులైలో తన భర్త సతేందర్ యాదవ్, అత్త శాంతిదేవి, మామ నాథూరాం కట్నం కోసం వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 1994లో తన పెళ్లి జరిగిందని, తన తల్లిదండ్రులు కట్నకానుకలు సమర్పించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయినప్పటికీ అత్తింటివారు ఇంకా తేవాలని తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది. దీంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపి, ఆ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. బాధితురాలి పట్ల వేధింపులకు పాల్పడ్డారంటూ రెండేళ్లు జైలు శిక్ష విధించింది. కాగా, ఆమె మామ నాథూరాం మరణించగా, భర్త సతేందర్ మరో వివాహం చేసుకున్నాడు.

More Telugu News