: రాహుల్ గాంధీని వెంటనే తొలగించాలి: రాజ్ నాథ్
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీపై బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ నిప్పులు చెరిగారు. ప్రధాని మన్మోహన్ ను అగౌరవపరచిన రాహుల్ గాంధీని వెంటనే తొలగించాలని రాజ్ నాథ్.. సోనియాను డిమాండ్ చేశారు. లేకపోతే కనీసం క్షమాపణలైనా చెప్పించాలని అన్నారు. బీజేపీ ఏనాడూ ప్రధానమంత్రిని కించపరిచేలా వ్యాఖ్యానించలేదని తెలిపారు. నిన్న కర్ణాటకలో జరిగిన ఒక ర్యాలీలో సోనియా ప్రసంగిస్తూ.. ప్రధాని మన్మోహన్ వెనుక పార్టీ మొత్తం ఉందని చెబుతూ... ప్రస్తుత పరిస్థితికి బీజేపీనే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా, చేతనైతే సోనియా తన కుమారుడిపై చర్యతీసుకోవాలి కానీ... బీజేపీపై విమర్శలు గుప్పించడం సరికాదని రాజ్ నాథ్ కాంగ్రెస్ అధినేత్రిపై నిప్పులు చెరిగారు.