: ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం: ఒబామా

ప్రభుత్వానికి నిధుల కేటాయింపుపై అమెరికా కాంగ్రెస్ లో బడ్జెట్ పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అక్కడి ప్రభుత్వ సంస్థలు మూతబడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, కాంగ్రెస్ బడ్జెట్ ను ఆమోదించి నిధులు కేటాయించే వరకు ప్రభుత్వ సంస్థల మూసివేత కొనసాగుతుందని వెల్లడించారు. అమెరికన్ కాంగ్రెస్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైందని ఒబామా వ్యాఖ్యానించారు.

More Telugu News