: తిరుపతిలో ఆర్టీసీ యూనియన్ నేతలతో భేటీ కానున్న ఏకే ఖాన్
సీమాంధ్రలో ఎగసిపడుతున్న సమైక్య ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయిపోయాయి. అయితే, తిరుమల బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గరపడుతుండటంతో... ఆర్టీసీ యాజమాన్యానికి ముచ్చెమటలు పడుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది.
కార్మికులను, ఉద్యోగులను బుజ్జగించేందుకు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు తిరుపతిలో ఆయన ఆర్టీసీ కార్మిక సంఘ నేతలతో భేటీ కానున్నారు. వీరితో భేటీ అనంతరం టీటీడీ ఉన్నతాధికారులతో ఖాన్ సమావేశం కానున్నారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా... సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక నేతలు ప్రెస్ మీట్ లో ప్రకటించడం గమనార్హం.