: ప్రధానికి సోనియా బాసట

ప్రధాని మన్మోహన్ సింగ్ కు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ యావత్తూ ప్రధానికి మద్దతుగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో నేడు జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే యూపీఏ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్ పై రాహుల్ గాంధీ విరుచుకుపడగా, దానిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. 'ఆర్డినెన్స్ తెచ్చేదీ వారే, దాన్ని తప్పుబట్టేదీ వారే' అంటూ బీజేపీ నేతలు దుయ్యబట్టారు. ఈ విషయమై బీజేపీ నేతలు ప్రధానిని లక్ష్యంగా చేసుకోవడాన్ని సోనియా ఖండించారు.

ప్రధానిని అపహాస్యం చేయడం తగదని వారికి హితవు పలికారు. ఇటీవల కాలంలో తమ విజయాలన్నీ మన్మోహన్ నేతృత్వంలో సాధించినవేనని సోనియా చెప్పుకొచ్చారు. చట్టసభల్లో నేరచరితుల ప్రవేశానికి వీలుగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా, దాన్ని చింపి చెత్తబుట్టలో వేయండని రాహుల్ కటువైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News