: కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దత్తన్న

హైదరాబాదులో నిన్న జరిగిన సకల జనుల భేరి సభలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. సీమాంధ్రలో పుట్టినవాళ్ళంతా తెలంగాణ ద్రోహులే అని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తన స్థాయిని మరిచిపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంక్షించే వారెవరూ ఇలా మాట్లాడరని విమర్శించారు. ఇకనైనా స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News